మంగళగిరిలో ప్రత్యేకంగా దుర్గమ్మ అలంకరణ

గుంటూరు జిల్లా మంగళగిరి వీవర్స్ కాలనీలోని ఎంటీఎంసీ హైస్కూల్ వద్ద శ్రీదుర్గాభవాని భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మ అమ్మవారిని ప్రత్యేకంగా రూపొందించారు. శ్రీచక్ర సహితంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. యజ్ఞాలు, హోమాల్లో పవిత్రతకు ప్రతీకగా ఉపయోగించే దర్భలతో అమ్మవారిని అలంకరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దర్భల దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు.


