← Back to news

Passport పై ఇక ట్రంప్ ఫోటో !

By aravinda nyayapati· 29 Apr 2026· Washington
Passport పై ఇక ట్రంప్ ఫోటో !

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రచారం పిచ్చి పీక్స్ కి చేరింది. దేశానికి ఇండిపెండెన్స్ వచ్చి 250 ఏళ్లు గడిచిన సందర్భంగా ఈ జులైలో స్పెషల్ గా కొన్ని పాస్ పోర్టులు మంజూరు చేయనున్నారు. ఆ పాస్ పోర్టులపై ట్రంప్ తన ఫోటోతో పాటు ధగధగలాడే గోల్డెన్ సిగ్నేచర్‌ని ముద్రిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో దేశ గొప్పతనాన్ని చాటే చారిత్రక వారసత్వ కట్టడాలు ఎవరైనా ముద్రిస్తారు. కానీ ట్రంప్ రూటే సెపరేట్. ఇప్పటికే ట్రంప్ కరెన్సీ నోట్లపై సంతకం వేశారు. అది చాలదన్నట్టు పాస్ పోర్ట్ లపై ఫోటో వేయించుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.

More in World