నీరసం ఇలా దూరం..!

నీరసం, అలసట తరచూ వేధిస్తుంటే ఆహారం, వ్యాయామం, నిద్రపై శ్రద్ధ పెట్టాలి. అరటిపండ్లు, బ్రౌన్ రైస్, గుడ్లు, ఓట్స్, చేపలు వంటి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజూ కొంత సమయం వ్యాయామం చేయడం మంచిది. ప్రాసెస్ చేసిన ఆహారం, అధిక చక్కెరను తగ్గించాలి. నీళ్లు తగినంత తాగాలి. అలసటగా ఉంటే విశ్రాంతి తీసుకోవాలి. రోజూ సరిపడా నిద్ర అవసరం. నచ్చిన మ్యూజిక్ వినడం, స్నేహితులతో సమయం గడపడం మనసును ఉత్సాహంగా ఉంచేందుకు సహాయపడతాయి. నీరసం తరచూ ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.



