కుప్పంలో రూ.38 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.10 కోట్లతో ఆర్డీఓ, ఏఎస్పీ కార్యాలయాలకు శంకుస్థాపన చేశారు. రూ.3.30 కోట్లతో నిర్మించిన ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్, మెటీరియల్ రికవరీ సెంటర్ ప్రారంభించారు. మల్లనూరు జూనియర్ కాలేజీకి భూమిపూజ చేశారు. వ్యవసాయ ఫీడర్లకు విద్యుత్ సరఫరా కోసం 15 మెగావాట్ల పీఎం కుసుమ్ సోలార్ ప్రాజెక్టు ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ ప్రసాదరావు పాల్గొన్నారు.



