లింగపాలెంలో పోషణ మాసం: శ్రీమంతాలు, అక్షరాభ్యాసాలు

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం లింగపాలెం-3 అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ మాసం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం జరిగింది. సెక్టార్ సూపర్‌వైజర్ కమల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో తక్కువ ఖర్చుతో అధిక పోషక విలువలు ఉండే ఆహార పదార్థాలను తయారు చేసి ప్రదర్శించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు తీసుకోవాల్సిన సమతుల్య ఆహారంపై CDPO సత్యవతి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గర్భిణులకు శ్రీమంతం, చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించి ప్రతిజ్ఞలు చేయించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎర్రా రమేష్, ఉప సర్పంచ్ సురేష్ పాల్గొన్నారు.





