← Back to news

అమరవీరులకు ఐద్వా ఘన నివాళులు

By DK· 2h ago
అమరవీరులకు ఐద్వా ఘన నివాళులు

సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట మండలం బైరాన్‌పల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైన వీరవనితలను స్మరించుకుంటూ ఐద్వా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో స్ఫూర్తి యాత్ర నిర్వహించారు. పాలకుర్తిలో ప్రారంభమైన యాత్ర కడవెండి మీదుగా బైరాన్‌పల్లికి చేరుకుంది. గ్రామాల్లో ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు యాత్రకు స్వాగతం పలికారు. బైరాన్‌పల్లి బురుజు వద్ద అమరవీరులకు నివాళులర్పించి, సభలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడారు. 1946-51 మధ్య జరిగిన పోరాటంలో మహిళలు కీలకంగా పాల్గొని అమరులయ్యారని గుర్తుచేశారు.

More in Local