పర్యావరణ పరిరక్షణ కోసం Run for Nature

TG: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో “రన్ ఫర్ నేచర్” 3K రన్ ఉత్సాహభరితంగా నిర్వహించారు. ORR బైపాస్‌పై కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి 3K రన్‌ను ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛమైన గాలి, పచ్చదనం పెంపొందించడంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా రన్ నిర్వహించారు. MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి పృథ్వీరాజ్ నేతృత్వంలో కార్యక్రమం జరిగింది. నాయకులు, ఫౌండేషన్ సభ్యులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.



