← Back to news

CEIR ఎఫెక్ట్.. ఆటోలో పోయిన ఫోన్ ఇలా వచ్చింది!

By Srikanth Goud· 1d ago· Peddapalle (Ct), Peddapalli, Peddapalli
CEIR ఎఫెక్ట్.. ఆటోలో పోయిన ఫోన్ ఇలా వచ్చింది!

జగిత్యాల జిల్లా ధర్మారంలో ఆటోలో ప్రయాణిస్తున్న లక్షెట్టిపేట మండలం గుల్లకోటకు చెందిన సాగే ప్రేమలతకు మే నెలలో ఫోన్ పోయింది. కానీ CEIR పోర్టల్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు టెక్నికల్ ట్రాకింగ్ ద్వారా ఫోన్‌ను రికవరీ చేశారు. గురువారం ధర్మారం ఎస్ఐ ఈ.శ్రీకాంత్ ఆమెకు ఫోన్ అప్పగించారు. ఇక CEIR ఉందంటే పోయిన ఫోన్ మళ్లీ వచ్చే ఛాన్స్ ఉందని ఈ కేసు రుజువు చేస్తోంది.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.