నిద్రపోతున్న భర్తను చంపిన భార్య

TG: హైదరాబాద్ నగరం అల్వాల్‌లోని గోపాల్‌నగర్‌లో 52 ఏళ్ల శ్రీనివాస్‌ను ఆయన భార్య రమాదేవి చంపేసింది. రాత్రి వాళ్లిద్దరి మధ్య గొడవ జరిగింది. తెల్లవారుజామున భర్త నిద్రపోతుండగా, భార్య అతని మీద గొడ్డలితో దాడి చేసి హత్య చేసింది. వారికి ఇద్దరు పిల్లలు. కుటుంబ విషయాలపై వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని చుట్టుపక్కలవారు చెప్పారు. నిందితురాలు పోలీసులకు లొంగిపోవడంతో కేసు నమోదు చేశారు.


