NSS Day సందర్భంగా విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు

అల్లూరి జిల్లా అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో NSS Day సందర్భంగా చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ‘పచ్చని ఊరు–స్వచ్ఛమైన భారతం’ అంశంపై నిర్వహించిన ఈ పోటీల్లో 12 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి.హెచ్. కేశవరావు ఆదేశాల మేరకు పోటీలు నిర్వహించినట్లు NSS POలు వై.విజయలక్ష్మి, బి.లచ్చన్న తెలిపారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఈ నెల 24న నిర్వహించనున్న NSS Day కార్యక్రమంలో బహుమతులు అందజేయనున్నట్లు వారు వెల్లడించారు.



