← Back to news

31 మంది దివ్యాంగులకు ఉచిత ట్రై సైకిళ్లు అందజేత

By DK· 12h ago
31 మంది దివ్యాంగులకు ఉచిత ట్రై సైకిళ్లు అందజేత

ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్లలో 31 మంది దివ్యాంగులకు ఉచితంగా మూడు చక్రాల స్కూటీలను మంత్రి గొట్టిపాటి రవికుమార్ పంపిణీ చేశారు. మేదరమెట్లలోని SB కన్వెన్షన్ హాల్‌లో SRR Project Private Limited హైదరాబాద్‌కు చెందిన దాతల సహకారంతో ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన 119 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను మంత్రి అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పాల్గొన్నారు.

More in Local