23న ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి భూమిపూజ.. సీఎం హాజరు

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అబ్బురాజు పాలెం పరిధిలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి కొత్త భవనానికి ఈ నెల 23న భూమిపూజ జరగనుంది. సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్, పార్కింగ్, బందోబస్తు ఏర్పాట్లపై సోమవారం ఏఎస్ఎల్ సమావేశం జరిగింది. కలెక్టర్ సాయి శ్రీకాంత్ వర్మ, ఎస్పీ వకుల్ జిందాల్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తదితర అధికారులు పాల్గొన్నారు.



