← Back to news

అరకులో హాట్ ఎయిర్ బెలూన్ రీలాంచ్!

By B V Appalanaidu· 4h ago· Yandapallivalasa, Araku Valley, Alluri Sitharama Raju

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు పద్మాపురం బొటానికల్ గార్డెన్స్‌లో మెగా హాట్ ఎయిర్ బెలూన్‌ను సోమవారం పునఃప్రారంభించారు. జిల్లా కలెక్టర్ టి. నిషాంతి, ఐటీడీఏ పీఓ ఆదిత్య వర్మ బెలూన్‌ను ప్రారంభించారు. పర్యాటకులకు కొత్త అనుభూతి అందించేందుకు ఈ ఏర్పాటు చేశారు. కలెక్టర్ స్వయంగా బెలూన్‌లో ప్రయాణించి అరకు ప్రకృతి అందాలను వీక్షించారు. ప్రామాణిక భద్రతా ప్రమాణాలతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

More in Local