← Back to news

లంచం తీసుకుంటుండగా ట్రాప్.. ముగ్గురు అరెస్ట్

By నిమ్మనగంటి అనిల్ బాబు· 1d ago· Upparagudem, Seerole, Mahabubabad
లంచం తీసుకుంటుండగా ట్రాప్.. ముగ్గురు అరెస్ట్

రంగారెడ్డి జిల్లా DMHO స్వర్ణకుమారి, హెల్త్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ప్రైవేట్ డ్రైవర్ కృష్ణయ్యపై ACB కేసు నమోదైంది. ఫిజియోథెరపీ సెంటర్ లైసెన్స్ కోసం ₹.2 లక్షలు డిమాండ్ చేసినట్లు ACB అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా ₹.1 లక్ష లంచం తీసుకుంటుండగా డ్రైవర్ కృష్ణయ్యను ACB అధికారులు ట్రాప్ చేశారు. సీజ్ చేసిన క్లినిక్‌ తెరిచేందుకు, కొత్త లైసెన్స్ జారీ చేయడం కోసం లంచం డిమాండ్ చేసినట్లు తేలడంతో స్వర్ణకుమారి, శ్రీనివాస్, కృష్ణయ్యలను అరెస్ట్ చేశారు.

More in Local