← Back to news

డ్రగ్స్‌పై పోలీసుల ప్రత్యేక తనిఖీలు!

By నిమ్మనగంటి అనిల్ బాబు· 4h ago· Upparagudem, Seerole, Mahabubabad
డ్రగ్స్‌పై పోలీసుల ప్రత్యేక తనిఖీలు!

నాగర్‌కర్నూల్ జిల్లా] కొల్లాపూర్ మండలం చిన్నంబావిలో మత్తు పదార్థాల విక్రయాలపై పోలీసులు సోమవారం ప్రత్యేక తనిఖీలు చేశారు. నార్కోటిక్ డాగ్ స్క్వాడ్‌తో హోటళ్లు, కిరాణా, పాన్, మెడికల్ షాపులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై రామన్ గౌడ్ హెచ్చరించారు. అనుమానాస్పద కదలికలు ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.

డ్రగ్స్‌పై పోలీసుల ప్రత్యేక తనిఖీలు!
డ్రగ్స్‌పై పోలీసుల ప్రత్యేక తనిఖీలు!

More in Local