← Back to news

7 రోజుల్లో చెక్కులపై సంతకం చేయకుంటే చర్యలు!

By A.Ajay· 2h ago
7 రోజుల్లో చెక్కులపై సంతకం చేయకుంటే చర్యలు!

TG: గ్రామ పంచాయతీల్లో చెక్కుల చెల్లింపులు ఆలస్యం కాకుండా ప్రభుత్వం కొత్త ఆదేశాలు ఇచ్చింది. సర్పంచ్‌ సంతకం చేసిన చెక్కును ఉప సర్పంచ్‌కు ఇచ్చిన తర్వాత 7 పని దినాల్లోగా సరైన కారణం లేకుండా సంతకం చేయకపోతే జిల్లా కలెక్టర్‌ విచారణ చేపడతారు. కావాలనే జాప్యం చేసినట్లు తేలితే రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటారు. అవసరమైతే ఉప సర్పంచ్‌కు ఉన్న చెక్‌ పవర్‌ను పంచాయతీ కార్యదర్శి, MPO లేదా MPDOలో ఒకరికి అప్పగించే అవకాశం ఉంది.

More in TG