← Back to news

విద్యాభవన్‌ ముట్టడి.. పలువురు UTF నాయకుల అరెస్ట్

By epuri rajaratnam· 1d ago
విద్యాభవన్‌ ముట్టడి.. పలువురు UTF నాయకుల అరెస్ట్

AP: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులోని విద్యాభవన్‌ ముట్టడికి యూటీఎఫ్‌ నాయకులు భారీగా తరలివచ్చారు. ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని, విద్యాశాఖ మంత్రి జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకుని పలువురు UTF నాయకులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.

విద్యాభవన్‌ ముట్టడి.. పలువురు UTF నాయకుల అరెస్ట్
విద్యాభవన్‌ ముట్టడి.. పలువురు UTF నాయకుల అరెస్ట్

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 5h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.