చంద్రశేఖర్ నాయకత్వంలో పార్టీ బలోపేతానికి కృషి

విజయనగరం జిల్లా వైఎస్సార్‌సీపీ నూతన అధ్యక్షుడిగా మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ నియమితులైన నేపథ్యంలో, రాజాం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి డా. తలే రాజేష్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సన్మానించారు. ఆయన నాయకత్వంలో విజయనగరం జిల్లాలో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యలపై మరింతగా పోరాడాలని ఆకాంక్షించారు.



