← Back to news

బోరు పక్కనే ట్రాన్స్‌ఫార్మర్ వద్దు

By Mohan· 6h ago· Vizianagaram
బోరు పక్కనే ట్రాన్స్‌ఫార్మర్ వద్దు

విజయనగరం జిల్లా రేగిడి మండలం బూరాడ గ్రామంలోని ఎస్సీ కాలనీలో తాగునీటి బోరింగ్ (చేతి పంపు) పక్కనే విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కోసం దిమ్మె కట్టడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోరు వద్ద మహిళలు బట్టలు ఉతకడం, పిల్లలు నీళ్లు పట్టుకోవడం చేస్తుంటారని, తడి ప్రదేశంలో ట్రాన్స్‌ఫార్మర్ ఉండటం ప్రమాదకరమని చెబుతున్నారు. దీంతో ప్రాణాపాయం ఉందని భయపడుతున్నారు. అధికారులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్‌ను సురక్షిత ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరారు.

More in Local