← Back to news

రాయదుర్గంలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన

By Bala· 1d ago
రాయదుర్గంలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన

TG: శేరిలింగంపల్లి నియోజకవర్గం రాయదుర్గంలోని మల్కంచెరువు వెనుక ఏరియాలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి సోమవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. 2.85 ఎకరాల ప్రభుత్వ స్థలంలో 480 ప్లాట్లు నిర్మించనున్నారు. ఒక్కో ప్లాట్‌ 528 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. కార్యక్రమానికి లబ్ధిదారులు కుటుంబ సభ్యులతో మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుకోవాలని హౌసింగ్‌ బోర్డు కమిషనర్‌ గౌతమ్‌ కోరారు.

More in TG