← Back to news

పలాసలో రాజకీయ వేడి.. ఆశావహుల్లో టెన్షన్

By K. PURNA CHANDU.· 1d ago· Palasa, Palasa, Srikakulam
పలాసలో రాజకీయ వేడి.. ఆశావహుల్లో టెన్షన్

శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపల్ పీఠంపై రాజకీయ వేడి పెరుగుతోంది. చైర్‌పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వు కావడంతో ప్రధాన పార్టీల్లో ఆశావహుల సందడి మొదలైంది. పీఠాన్ని దక్కించుకునేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో పాటు వైఎస్సార్‌సీపీ కూడా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాలు, ప్రజాదరణ కీలకం కానున్నాయి. దీంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొనగా, ఎన్నికల నోటిఫికేషన్ కోసం పార్టీలు ఎదురుచూస్తున్నాయి.

More in Local