← Back to news

అబిడ్స్‌లో సినీ ప్రొడ్యూసర్ కారు బీభత్సం

By Mahesh· 13 Aug 2026· హైదరాబాద్‌

TG: హైదరాబాద్‌ అబిడ్స్‌లో సినీ ప్రొడ్యూసర్ బొమ్మకు మురళీకి చెందిన కారు ప్రమాదానికి గురైంది. నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళను కారు ఢీకొనడంతో ఆమె కాలుకు ఫ్రాక్చర్‌ అయింది. గాయాలైన మహిళను ఫామిలీ మెంబెర్స్ దగ్గర్లోని ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ట్రీట్‌మెంట్ ఖర్చుల కోసం ప్రొడ్యూసర్‌ను కలవగా, కారు తనదేనని చెప్పినప్పటికీ డబ్బులు ఇవ్వనని చెప్పినట్లు బాధిత కుటుంబం ఆరోపించింది. ఘటనపై అబిడ్స్‌ పోలీసులు కేసు బుక్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 7h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.