తెలంగాణ విద్యా బడ్జెట్ 8.2 శాతం..సరిపోతుందా?

TG: 2026–27 తెలంగాణ బడ్జెట్‌లో విద్యాశాఖకు 26,674 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది మొత్తం బడ్జెట్‌లో 8.2 శాతంగా ఉంది. గత ఏడాది 7.6 శాతంగా ఉన్న ఈ కేటాయింపు కొంత పెరిగినా, దేశంలో అన్ని రాష్ట్రాల 2025–26 బడ్జెట్లలో విద్యకు సగటు కేటాయింపు 14.5 శాతంగా ఉంది. తెలంగాణలో విద్యకు 18 శాతంగా బడ్జెట్ కేటాయించాలనే డిమాండ్ ఇప్పుడు TPF చేస్తున్న <a href="https://www.theclearcutnews.com/n/cNdpBDB">విద్యాబస్సుయాత్ర</a>లో ప్రధాన అంశంగా మారింది.


