సోకిలేరు వాగులో మృతదేహం.. కాళ్లకు సంకెళ్లు!

పోలవరం జిల్లా చింతూరు మండలం తులసిపాక సమీపంలోని సోకిలేరు వాగులో సోమవారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. ఆదివారం అదే వాగులో గల్లంతైన భీమవరం యువకుడి కోసం గాలింపు సాగుతుండగా.. ఈ మృతదేహం దొరకడం కలకలం రేపింది. ఆందోళనగా మృతదేహం కాలికి సంకెళ్లు వేసి ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మతిస్థిమితం లేని వ్యక్తిది అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.



