← Back to news

జడ్జీల రిటైర్మెంట్ వయస్సు 62కి పెంపు

By సందీప్· 2h ago· Billalapuram, Nandyal Urban, Nandyal
జడ్జీల రిటైర్మెంట్ వయస్సు 62కి పెంపు

రాష్ట్ర గవర్నర్ ఈ నెల 1న ఆర్డినెన్స్ జారీ చేశారు. న్యాయాధికారుల పదవీ విరమణ వయస్సు 61 నుంచి 62 ఏళ్లకు పెంపు. ఇది 31-03-2026 నుంచి అమల్లోకి వస్తుంది. గతంలో 01-11-2024 నుంచి 60 నుంచి 61 ఏళ్లకు పెంచారు. సుప్రీంకోర్టు ఆగస్టు 5న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 24న ఏపీ హైకోర్టు పూర్తిస్థాయి సమావేశంలో 62 ఏళ్లకు పెంచాలని తీర్మానించింది. సుప్రీంకోర్టు, హైకోర్టు సిఫారసుల మేరకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిందని మంత్రి ఫరుక్ తెలిపారు.

More in Local