గెజిటెడ్ HMల సంఘం జిల్లా అధ్యక్షులుగా సాయన్న

నిర్మల్ జిల్లా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ఎన్నికలు ఆదివారం పెన్షనర్స్ భవన్‌లో నిర్వహించారు. జిల్లా అధ్యక్షులుగా నర్సాపూర్ MEO సాయన్న, ప్రధాన కార్యదర్శిగా కుబీర్ MEO ఆర్.విజయ్ కుమార్, కోశాధికారిగా రాజశేఖర్ ఎన్నికయ్యారు. రాష్ట్ర కౌన్సిలర్లుగా బాసర MEO జి. మైసాజి, కె.విజయను ఎన్నుకున్నారు. రాష్ట్ర బాధ్యులు తుకారం ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. గత అధ్యక్షుడు బి. మహేందర్, ప్రధాన కార్యదర్శి సదానందం నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.



