నా పేరు మీ వ్యాపారంలోకి లాగొద్దు!

నటి ఊర్వశి రౌతేలా పేరు, ఫొటోలు, వీడియోలను అనుమతి లేకుండా ఉపయోగించారని ఆమె టీమ్ ఆరోపించింది. USA లాస్ ఏంజెల్స్‌కు చెందిన ఓ AI కంపెనీపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. తమ అనుమతి లేకుండా ఊర్వశి గుర్తింపును వ్యాపారం కోసం వాడుకున్నారని పేర్కొంది. ఈ వ్యవహారంలో 7,000 కోట్ల నష్టపరిహారం కోరుతున్నట్లు ప్రకటించింది. అనుమతి లేకుండా తన పేరు, ఫొటోలు, వీడియోలను వ్యాపారంలో ఉపయోగించవద్దని ఊర్వశి టీమ్ స్పష్టం చేసింది.



