← Back to news

విజయవాడ‌లో ప్రమాదం.. నలుగురు సజీవదహనం

By Nani Eluri· 2h ago

AP: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ కారు రోడ్డుపై డివైడర్‌ను ఢీకొట్టడంతో కారులో మంటలు రేగాయి. కారులోని ఐదుగురిలో నలుగురు సజీవ దహనం కాగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి క్రిటికల్ కండిషన్‌లో ఉన్నాడు. కొమ్మారెడ్డి రామ్‌దేవ్, తల్లి అరుణ, నంబూరుకు చెందిన టి.విజయ, ఒక చిన్నారి మరణించారు. మృతులు నున్న, నంబూరు ప్రాంతాలకు చెందినవారు. వారి కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.

More in AP