← Back to news

గురుకుల విద్యార్థిని మృతిపై ఆందోళన

By Srinivas· 1d ago
గురుకుల విద్యార్థిని మృతిపై ఆందోళన

TG: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ మండలం కమ్మదనం గురుకుల పాఠశాలలో గిరిజన విద్యార్థిని ముడావత్‌ అశ్విని అనుమానాస్పద మృతిపై గురువారం ఆందోళన చేపట్టారు. LHPS, SFI నాయకులు గురుకుల పాఠశాల వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. అశ్విని మృతిపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని, ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలని ఎల్‌హెచ్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాల్‌ నాయక్‌ కోరారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 4h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.