← Back to news

రూ.5.50 కోట్లతో కోటిలింగాల ఆలయ పునర్నిర్మాణం

By Srikanth Goud· 5h ago· Jagitial, Jagitial, Jagitial
రూ.5.50 కోట్లతో కోటిలింగాల ఆలయ పునర్నిర్మాణం

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాలలోని చారిత్రక శ్రీ కోటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. పెద్దవాగు, గోదావరి సంగమ ప్రాంతంలోని శాతవాహనుల కోట బురుజుపై పెద్ద బండరాళ్లతో నిర్మించిన ఈ శైవక్షేత్రం వందల ఏళ్లుగా భక్తుల ఆరాధనకు నిలయంగా ఉంది. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణాన్ని జేసీబీలతో తొలగించే పనులు చేపట్టారు. సుమారు రూ.5.50 కోట్ల వ్యయంతో ఆలయాన్ని పునర్నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు.

రూ.5.50 కోట్లతో కోటిలింగాల ఆలయ పునర్నిర్మాణం
రూ.5.50 కోట్లతో కోటిలింగాల ఆలయ పునర్నిర్మాణం

More in Local