← Back to news

అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. UAPA కేసు పెట్టాలని డిమాండ్

By Anumula· 1d ago
అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. UAPA కేసు పెట్టాలని డిమాండ్

సంగారెడ్డి జిల్లాలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను అవమానిస్తూ హమారా ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు, పుస్తక కంటెంట్, సోషల్ మీడియా పోస్టులపై ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అనుముల తుకారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అంబేద్కర్‌ను కించపరిచే ఈ కంటెంట్‌ను సమగ్రంగా పరిశీలించి, డిజిటల్ కంటెంట్‌ను తొలగించాలని, హమారా ప్రసాద్‌పై UAPA చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.