గుంతకల్లులో సైన్స్ టీచర్‌పై కత్తితో దాడి

AP: అనంతపురం జిల్లా గుంతకల్లు టౌన్‌లోని చైతన్య ప్రైవేట్ స్కూల్ సైన్స్ టీచర్ ఈవూరి అరుణ(44)పై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఆమె స్కూల్‌కు వెళ్తున్న టైంలో ఈ దాడి జరిగింది. ఆమె మెడకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనతో స్కూల్ పరిసరాల్లో భయాందోళన నెలకొంది. గతంలో బ్లాక్‌మెయిల్ వివాదం ఉన్నందున ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



