అగ్రికల్చర్ రీసెర్చి సెంటర్కు దళితుల భూములే కావాలా?
జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం రాయపురం గ్రామంలో భూమిలేని నిరుపేద దళిత కుటుంబాలకు ఇచ్చిన అసైన్డ్ భూములను అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ కోసం తీసుకునే ప్రయత్నాలను భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇన్‌చార్జి మాచర్ల ప్రకాష్ తీవ్రంగా ఖండించారు. రాయపురంలో 80 దళిత కుటుంబాలకు భూములు కేటాయించారని, ఆ భూములపై వ్యవసాయం చేసుకుంటూ వాళ్లు జీవనం సాగిస్తున్నారని తెలిపారు. అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ పేరుతో దళిత రైతులకు నోటీసులు జారీ చేయడం ఆందోళన కలిగిస్తోందన్నారు.



