← Back to news

మెయిన్ రోడ్డు పనులకు వ్యాపారులు సహకరించాలి: విజయ రమణారావు

By DK· 5h ago
మెయిన్ రోడ్డు పనులకు వ్యాపారులు సహకరించాలి: విజయ రమణారావు

పెద్దపల్లి పట్టణంలో జెండా చౌరస్తా నుంచి పెద్ద మజీద్ వరకు చేపడుతున్న మెయిన్ రోడ్డు వెడల్పు పనులను ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పరిశీలించారు. మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, కమిషనర్ ఆకుల వెంకటేష్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బందితో కలిసి పనుల పురోగతిని పరిశీలించి వ్యాపారుల సహకారం కోరారు. ఇప్పటికే 90 శాతం మంది వ్యాపారులు స్వచ్ఛందంగా భవనాలు తొలగించి సహకరించారని చెప్పారు. మిగిలిన వారు కూడా వినాయక నిమజ్జనం లోపు మార్కింగ్‌ ప్రకారం భవనాలు తొలగించుకోవాలని కోరారు.

More in Local