సమరభేరి సభ వాల్ పోస్టర్ల ఆవిష్కరణ

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలంలో బీఎస్పీ నాయకులు బహుజన రాజ్యాధికార సమరభేరి సభకు సంబంధించిన వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. బీఎస్పీ వ్యవస్థాపకులు మాన్యవర్ కాన్షీరాం 20వ వర్ధంతి సందర్భంగా అక్టోబర్ 9న హైదరాబాద్ బడంగ్‌పేట్ మున్సిపల్ గ్రౌండ్‌లో ఈ సభ నిర్వహించనున్నారు. బహుజన రాజ్యాధికార సమరభేరి సభకు బహుజనులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో నవాబుపేట మండల అధ్యక్షులు సూర్య నాయక్‌తో తదితరులున్నారు.



