అర్బన్ హెల్త్ సెంటర్లపై ఎమ్మెల్యే సమీక్ష

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని అర్బన్ హెల్త్ సెంటర్లలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. తిలక్ రోడ్డులోని తన కార్యాలయంలో అర్బన్ హెల్త్ సెంటర్ల చైర్మన్లు, ANMలు, నర్సులు, ఆశావర్కర్లు, వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉచిత ల్యాబ్ పరీక్షలు, మందులు, వ్యాక్సినేషన్, ప్రాథమిక వైద్య సేవలను సమర్థంగా అందించాలని కోరారు. వైద్య సిబ్బంది సమస్యలు, మౌలిక వసతుల మెరుగుదలకు తనవంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు.



