← Back to news

రోడ్లపై పశువులు.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు

By Mohan· 6h ago· Burada, Regidi Amadalavalasa, Vizianagaram

విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో రోడ్లపై పశువుల సంచారం సమస్యగా మారింది. ప్రధాన రహదారులు, బస్టాండ్, మార్కెట్ ప్రాంతాల్లో ఆవులు, గేదెలు తిరుగుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పశువులను రోడ్లపై వదిలే యజమానులకు రూ.2,000 జరిమానా విధించడంతో పాటు పశువులను గోశాలకు తరలిస్తామని మున్సిపల్ కమిషనర్ గతంలో హెచ్చరించారు. పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అయినప్పటికీ కొందరు యజమానులు పాలు పితికిన తర్వాత పశువులను రోడ్లపైకి వదులుతున్నారని స్థానికులు వాపోతున్నారు.

More in Local