← Back to news

Weaponsతో వెళ్తున్న షిప్ హైజాక్.. ఆరుగురు భారతీయులు బందీ!

By Mahesh· 21 Aug 2026· Somalia
Weaponsతో వెళ్తున్న షిప్ హైజాక్.. ఆరుగురు భారతీయులు బందీ!

సోమాలియా తీరంలో సముద్ర దొంగలు ఓ కార్గో షిప్‌ను హైజాక్ చేశారు. కెమెరూన్ జెండాతో వెళ్తున్న ‘LUTUF’ నౌకను సోమాలియాలోని పుంట్‌లాండ్ దగ్గరలో హైజాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ షిప్‌లో మొత్తం 10 మంది స్టాఫ్ ఉండగా, వారిలో ఆరుగురు ఇండియన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. టర్కీ నుంచి మొగదిషులోని మిలిటరీ ట్రైనింగ్ సెంటర్‌కు వెపన్స్, కమ్యూనికేషన్, శాటిలైట్ ఎక్విప్‌మెంట్స్ షిప్‌లో తీసుకెళ్తున్నారు. 8 మంది Pirates నౌకను తీర ప్రాంతం వైపు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఘటనపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

More in International