← Back to news

ఆయిల్ దొంగతనానికి వెళ్లి 37 మంది మృతి?

By Mahesh· 2h ago· ABN· Nigeria
ఆయిల్ దొంగతనానికి వెళ్లి 37 మంది మృతి?

నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. పైప్‌లైన్ నుంచి క్రూడ్ ఆయిల్ దొంగిలించేందుకు ప్రయత్నించే టైమ్‌లో టాక్సిక్ గ్యాస్ లీక్ కావడంతో కొందరు చనిపోయారు. రివర్స్ రాష్ట్రంలోని ఒక్రికా ప్రాంతంలో నిన్న అర్ధరాత్రి ఈ ఇన్సిడెంట్ జరిగినట్లు అక్కడి అధికారులు తెలిపారు. YEAC-నైజీరియా ప్రకారం 37 మంది వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరికొందరి ఆచూకీ కనిపించడం లేదని తెలిపింది. ఇంకా ఎంతమంది చనిపోయారన్నది పోలీసులు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. ఘటనపై ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది.

More in International