వరంగల్ MGMలో పేషెంట్‌పై పడిన పెచ్చులు
TG: వరంగల్ మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్ (MGM)లో షాకింగ్ ఘటన జరిగింది. ఆరోగ్యశ్రీ వార్డులో పైకప్పు పెచ్చులు ఒక్కసారిగా ఊడిపడటంతో ఓ పేషెంట్‌తో పాటు ఇద్దరు హాస్పిటల్ స్టాఫ్‌కు గాయాలయ్యాయి. పెరాలసిస్‌తో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న మస్తాన్‌తో పాటు అటెండర్స్ ఎల్లమ్మ, ఓంకార్ గాయపడ్డారు. వెంటనే స్పందించిన డాక్టర్లు గాయపడిన వారికి ట్రీట్‌మెంట్ అందించారు. ఈ ఘటనతో ప్రభుత్వ హాస్పిటల్స్ మెయింటెనెన్స్‌పై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


