← Back to news

సీఎం, డిప్యూటీ సీఎం రాక.. ఏర్పాట్ల పరిశీలన

By DK· 15h ago
సీఎం, డిప్యూటీ సీఎం రాక.. ఏర్పాట్ల పరిశీలన

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని రామాపురంలో ఈ నెల 29న జరగనున్న ‘జీ రామ్ జీ–పల్లె పండుగ’ కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రూ.10 వేల కోట్ల కేంద్రప్రభుత్వ పథకానికి సంబంధించిన ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ తదితరులు రామాపురంలో ఏర్పాట్లను పరిశీలించారు. సభా ప్రాంగణం, హెలిప్యాడ్, పార్కింగ్, VIP రాకపోకలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.

More in Local