దోమల నివారణకు చర్యలు చేపట్టండి

నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని పలు గ్రామాల్లో దోమలు విపరీతంగా పెరిగాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం వేళల్లో దోమల బెడద మరింత అధికమవుతోంది. డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా ప్రబలే ప్రమాదం ఉందని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధప్రాతిపదికన డ్రైనేజీలు శుభ్రపరచాలని, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, యాంటీ లార్వా మందులు పిచికారీ, పొగ మందు పిచికారీ చేయాలని కోరుతున్నారు.


