← Back to news

ప్రజావాణిలో BRS నేతల వినతిపత్రం

By Begari Ramu· 1h ago· Rudrur, Rudrur, Nizamabad
ప్రజావాణిలో BRS నేతల వినతిపత్రం

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరుగ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల BRS నాయకులు తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రజావాణిలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చాలాకాలం గడిచినా ఎన్నికల హామీలను పూర్తిగా అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రజావాణిలో BRS నేతల వినతిపత్రం

More in Local