← Back to news

ప్రమాదకరంగా అన్నారం లోలేవల్ వంతెన

By SIRIKONDA SAGAR· 1h ago
ప్రమాదకరంగా అన్నారం లోలేవల్ వంతెన

TG: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం అన్నారం గ్రామంలోని లోలెవల్ వంతెన శిథిలావస్థకు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరీంనగర్–జమ్మికుంట రెండు లైన్ల రహదారి నిర్మాణం ప్రారంభమై ఎనిమిదేళ్లు గడిచినా వంతెన పనులు పూర్తికాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక లారీల రాకపోకలతో వంతెనపై గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారిందని తెలిపారు. వాహనాల రాకపోకలతో దుమ్ము లేస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

ప్రమాదకరంగా అన్నారం లోలేవల్ వంతెన
ప్రమాదకరంగా అన్నారం లోలేవల్ వంతెన

More in Local