← Back to news

పేకాట ఆడుతున్న ఆరుగురి అరెస్ట్

By Devendra· 1h ago· Rangampeta, Rangampeta, East Godavari
పేకాట ఆడుతున్న ఆరుగురి అరెస్ట్

AP: తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్సై శివప్రసాద్ తెలిపారు. సమాచారం మేరకు సిబ్బందితో కలిసి పేకాట స్థావరంపై దాడి నిర్వహించినట్లు చెప్పారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.1,500 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివప్రసాద్ వెల్లడించారు. పేకాట, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

More in Local