మార్కాపురం జిల్లా తొలి ఎస్పీగా పంకజ్ కుమార్ మీనా

నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా తొలి ఎస్పీగా పంకజ్ కుమార్ మీనా నియమితులయ్యారు. రాజస్థాన్‌కు చెందిన ఆయన 2020 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం పోలవరం జిల్లా చింతూరులో ఓఎస్‌డీగా విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగోన్నతిపై మార్కాపురం జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టనున్నారు.



