← Back to news

మూడో పెళ్లిపై మహిళ ఫిర్యాదు

By Nani Eluri· 2 Oct 2026· X

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఓ మహిళ తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. షేక్ మహబూబ్ సుభాని తనను మూడో పెళ్లి చేసుకుని మోసం చేశాడని సోమేశ్వరి దేవి ఆరోపించింది. భర్త ఫోన్‌లో ఇతర మహిళలతో చాటింగ్‌లు చూసి ప్రశ్నించడంతో.. అతనికి ఇదివరకే ఇద్దరు భార్యలున్న విషయం తెలిసిందని చెప్పింది. తన డబ్బు, బంగారం తీసుకుని, గర్భవతిని చేసి వదిలేశాడని ఆరోపించింది. మొదటి భార్య విషయంలోనూ కొన్ని విషయాలు తెలిసినట్లు పేర్కొంది. తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది.

More in AP