తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించడంలేదు: కడియం

TG: గత 12ఇయర్స్‌గా తెలంగాణ డెవలప్‌మెంట్‌కు కేంద్రప్రభుత్వం సహకరించడం లేదని స్టేషన్‌ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసలు తెలంగాణ స్టేట్ ఏర్పడడమే ప్రధాని మోడీకి, బీజేపీ పార్టీకి ఇష్టంలేదన్నారు. అందుకే తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా ఆటంకాలు సృష్టించడమే బీజేపీ పనిగా పెట్టుకుందని ఫైర్ అయ్యారు. బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ పట్ల నిజంగా వివక్ష లేకుంటే వెంటనే కాజీపేట రైల్వే డివిజన్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు ప్రెస్‌మీట్లు పెట్టి స్టేట్ గవర్నమెంట్‌ను తిట్టడానికే మంత్రి పదవులు ఇచ్చాడని ఏద్దేవా చేశారు.


