← Back to news

"పేదలకు ఇళ్లు ఇవ్వాలి" CPM డిమాండ్

By Krishna· 2h ago
"పేదలకు ఇళ్లు ఇవ్వాలి" CPM డిమాండ్

విజయవాడ.. పాతబస్తీ 50వ డివిజన్‌లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం CPM నాయకులు నిరాహార దీక్ష ప్రారంభించారు. 5 దశాబ్దాలుగా నివసిస్తున్న పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా.. రూల్స్ సాకులు చెప్పడం అన్యాయమనీ, ఇల్లు లేని వారికి 2 సెంట్ల స్థలాలు ఇవ్వాలని CPM AP కార్యదర్శి వర్గ సభ్యులు CH బాబురావు డిమాండ్ చేశారు. కొండప్రాంతాలకు పట్టాలు ఇవ్వాలనీ, 10 లక్షల సాయం చెయ్యాలనీ, నగరాభివృద్ధికి ప్రత్యేక నిధి ఏర్పాటు చెయ్యాలనీ, జీవో 673 రద్దు చెయ్యాలని ఆయన కోరారు.

More in Politics