← Back to news

పోలీస్ వాహనాలపై ప్రత్యేక దృష్టి

By Srikanth Goud· 1d ago· Ramagundam, Ramagundam, Peddapalli
పోలీస్ వాహనాలపై ప్రత్యేక దృష్టి

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ వాహనాల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని CP అంబర్ కిషోర్ ఝా ఆదేశించారు. మంగళవారం పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల వాహనాలను పరిశీలించి, సర్వీసింగ్‌తో పాటు టైర్లు, బ్రేకులు, లైట్లు, ఇంజిన్ పనితీరును తరచూ తనిఖీ చేయాలని సూచించారు. అత్యవసర సమయాల్లో వాహనాలు సిద్ధంగా ఉండేలా చూడాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని, డ్రైవర్లకు రివార్డులు అందించాలని ఆదేశించారు.

పోలీస్ వాహనాలపై ప్రత్యేక దృష్టి

More in Local